వంగర మండలం కోనంగిపాడు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక ఆహార పక్షోత్సవాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కళ్యాణి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం నిర్వహించారు. చిరుధాన్యాలు స్థానిక ఆహార పదార్థాలతో పరిపూర్ణమైన ఆహార పంటల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భవతులు బాలింతలు కౌమార బాలికలు సంరక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.