మడ్డువలస ప్రాజెక్ట్ నీటిని సకాలంలో విడుదల చేస్తాం

77చూసినవారు
మడ్డువలస ప్రాజెక్ట్ నీటిని సకాలంలో విడుదల చేస్తాం
వంగర మాజీ జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావు నాయుడు మండల సమస్యలపై బుధవారం రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్కు తెలిపారు. మడ్డువలస మెయిన్ కెనాల్ నుండి 15 గ్రామాలకు నీటి సరఫరాకు సంభందించి కాలువలను బాగు చెయ్యాలని కోరారు. దీనిపై స్పందించి సుమారుగా 25 లక్షల మేర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తా మన్నారు. మడ్డువలస నీటిని సకాలంలో విడుదల చేస్తామని, కాలువల మరమ్మత్తులు, డాం గేట్ల లీకేజీపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్