సంతకవిటి మండలం జవాం గ్రామంలో పగడాలమ్మ జాతరలో ఎస్ఐ ఆర్. గోపాలరావుపై దాడి చేసిన వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాం రూరల్ సీఐ హెచ్. ఉపేంద్ర రావు మాట్లాడుతూ ఈనెల 13న యువకుల మధ్య వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్న ఎస్ఐ పై దాడి చేసి, గాయపరిచి, తన మేడలో బంగారం గొలుసు లాక్కొని యడ్ల రమణ పారిపోయాడన్నారు. బంగారం రికవరీ చేశామన్నారు. ఈమేరకు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.