రేగిడి మండలం ఉణుకూరు లో ఉన్న రోడ్డు గుంతల మయంగా ఏర్పడి ఎంతోమంది వాహన దారులు జారిపడి గాయాలు చేసుకుంటున్నారు. నడవడానికి కూడా అద్వానంగా తయారయింది. వర్షం పడితే చెరువును తలపిస్తుంది. ఈ రోడ్డు పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి తగదని సిఐటియు ర్యాలీగా చేపట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని వెంటనే రోడ్డు వేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి శంకర్ రావు డిమాండ్ చేస్తున్నారు.