రాజాం పట్టణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం మల్లికార్జున కాలనీలో 7వ పౌష్టికాహార పక్షోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ సిబ్బంది ఎం. శ్రీదేవి మాట్లాడుతూ పోషణ పక్వాడ ఇంటి విషయాల్లో పురుషులు గర్భిణి తల్లులకు ఇంటి పనుల్లో సహకారం చెయ్యాలన్నారు. మెరుగైన తల్లి, పిల్లల సంరక్షణకు, పౌష్టికాహారం అందించడంలో పురుషులు సహకరించడంలో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.