వంగర మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో మంగళవారం పాస్టర్ సంఘ సమావేశం జరిగింది. ఇందులో పాస్టర్లు గ్రామంలోని ప్రతి వీధిలోకి వెళ్లి ఏసుక్రీస్తు బోధలు చేశారు. ఆయనను నమ్మితే మంచి జీవితం, అనంతరం మోక్షం లభిస్తుందని తెలిపారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ అప్పలనాయుడు, పాస్టర్లు యేసు రత్నం, జాషువా హల్లెలూయ తదితరులు పాల్గొన్నారు.