రాజాంలో పాలిథిన్ కవర్లు నిషేధం

61చూసినవారు
రాజాంలో పాలిథిన్ కవర్లు నిషేధం
రాజాం పట్టణంలో పాలిథిన్ కవర్లు నిషేధం అమలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు తెలిపారు. గురువారం రాజాంలోని మున్సిపల్ సిబ్బందికి గుడ్డ సంచుల పంపిణీ చేశారు. ఎవరైనా పాలిథిన్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ సమితి కన్వీనర్ ఆర్ వి జే నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, రెడ్ క్రాస్ సాయిప్రశాoత్ కుమార్, పెంకి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్