రేపు భామిని మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

62చూసినవారు
రేపు భామిని మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
భామిని మండలంలోని గురండి ఫీడర్ పరిధిలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్లకు నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని భామిని ట్రాన్స్ కో ఏఈ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా గురండి, బిల్లుమడ, నేరడి. బి, వడ్డంగి, లోహరజోల, మూలగూడ, సింగిడి, నులకజోడు గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ తెలిపారు.

సంబంధిత పోస్ట్