రాజాం నియోజకవర్గంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో పొగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులు కబడి, కోకో, వాలీబాల్, యోగ, అథ్లెటి , ఆటలకు 21 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్య రావు, పిడి అజయ్ కుమార్, పి డి సంతోషిమాత, యోగ ఉపాధ్యాయులు దుర్గ ప్రసాద్ శనివారం తెలిపారు. వారు మాట్లాడుతూ వీరు శ్రీకాకుళంలో జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.