శ్రీ పోలిపల్లి అమ్మవారికి శ్రావణమాసపు గురువారం పూజలు

81చూసినవారు
శ్రీ పోలిపల్లి అమ్మవారికి శ్రావణమాసపు గురువారం పూజలు
రాజాం పట్టణములో కొలువై ఉన్న శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శ్రావణ మాసం గురువారం విశేష పూజలు జరిగాయి. అర్చకులు అమ్మవారిని ప్రాత కాలంలో అష్టోత్తర, శ్రీలలితా సహస్రనామావళితో, పుష్పాలతో అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకాదశి గురువారం కావటంతో అమ్మవారిని దర్శించుకోవడానికి అత్యధికంగా మహిళా భక్తులు విచ్చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్