రాజాం పట్టణంలో వెలసివున్న శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి హుండీ బుధవారం లెక్కించారు. ఈ మేరకు ఆలయ ఈఓ మాధవరావు ఆధ్వర్యంలో చీపురుపల్లి కనకమహాలక్ష్మి ఆలయం ఈఓ శ్రీనివాసు హాజరయ్యారు. పైడితల్లమ్మ వారి రెండు నెలలకు రూ. 3,24,800 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.