రాజాం: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కోండ్రు

55చూసినవారు
రాజ్యాంగ నిర్మాత, బడుగు, నిమ్నజాతుల ఆశాజ్యోతి డా. బి. ఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్ అన్నారు. ఈ మేరకు 135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా రాజాం పట్టణంలో సోమవారం అంబేద్కర్ విగ్రహనికివిగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేటికి కొనసాగిస్తుండడం ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్