రేగిడి మండలం ఉంగరాడమెట్ట డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఐదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు జరిగిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపల్ పి శ్రీనివాసరావు తెలిపారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుండి 12 గంటల వరకు అలాగే ఇంటర్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుండి నాలుగున్నర వరకు జరిగినట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.