రేగిడి ఆమదాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయా గా పనిచేస్తున్న ఎస్సీ మహిళ గోడె రాములమ్మను తప్పించి, బీసీ మహిళ ముంజేటి పార్వతి ను కొనసాగిస్తూ స్కూల్ కమిటీ చేసిన తీర్మానాన్ని గురువారం సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్మోహన్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇల్లు లేని, ముగ్గురు పిల్లలతో ఉన్న, నిరుపేద ఎస్సీ ఒంటరి మహిళను తప్పించదవడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు వినతిపత్రం అందజేశారు.