సామాజిక రుగ్మతల్ని సరిచేస్తూ సమాజాన్ని చక్కని మార్గంలో నడిపించేది సాహిత్యమేనని రాజాం రచయితలు వేదిక నిర్వాహకుడు, రాష్ట్రస్థాయి ఉగాది పురస్కార గ్రహీత గార రంగనాథం తెలిపారు. ఆదివారం రాజాంలో సమావేశం నిర్వహించారు. సమాజంలోని మూఢనమ్మకాలు, వెనుకబాటుతనం వంటి రుగ్మతలను సాహిత్యం ద్వారా సరి చేయవచ్చని అందుచేతనే 10 సంవత్సరాల క్రిందట తాను రాజాం రచయితల వేదికను స్థాపించానని ఆయన వివరించారు.