రాజాం: రంపం బ్లేడు తగిలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

85చూసినవారు
రాజాం: రంపం బ్లేడు తగిలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
మిషన్ రంపం తగిలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన రాజాంలో చోటు చేసుకుంది. రాజాంలో అరసవిల్లి దుర్గారావు అనే కార్పెంటర్ శుక్రవారం మిషన్ రంపంతో కర్రలు కోస్తున్న క్రమంలో మిషన్ రంపం చేజారి అతని కాళ్లపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కావడంతో దుర్గారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న 108 ఈ ఎం టి ఈశ్వరరావు, పైలట్ పవన్ కుమార్ ప్రధమ చికిత్స చేసి పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్