రాజాం: మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి

65చూసినవారు
రాజాం: మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి
రాజాం మండలం మగ్గూరు ఎంపీపీ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ వై దుర్గారావు బుధవారం పరిశీలించారు. ముందుగా ఆయన పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్నిసామర్థ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్