ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో ప్రభుత్వం నాణ్యమైన భోజనాన్ని సరఫరా చేయనున్నట్లు రాజాం తహసిల్దార్ రాజశేఖర్ అన్నారు. గురువారం స్థానిక హైస్కూల్లో సన్న బియ్యం సరఫరా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల నుండి విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఎంపీడీవో దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.