మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ శనివారం టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద భీమా దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటికి రాజాం నియోజకవర్గంలో 40 వేల తెదేపా సభ్యత్వాలు నమోదు అయినట్లు తెలిపారు.