రాజాం: మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ విగ్రహానికి వినతి

66చూసినవారు
ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని రాజాం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం రాజాం పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తూ నిరసన తెలిపారు. కార్మికులను పర్మినెంట్ చేయకుండా కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే వెట్టిచాకిరి చేయించుకోవడం సరైనది కాదన్నారు.

సంబంధిత పోస్ట్