రాజాం: మే 10న జాతీయ లోక్ అదాలత్

84చూసినవారు
రాజాం: మే 10న జాతీయ లోక్ అదాలత్
రాజీయే రాజమార్గమని రాజాం సీనియర్ సివిల్ జడ్జి కె. శారదాంబ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజాం కోర్టు ఆవరణంలో పోలీస్, రెవిన్యూ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. మే 10వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేరకు లోక్ అదాలతో రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు, ఇరుపార్టీల అంగీకారంతో పరిష్కరించబడునని తెలిపారు.

సంబంధిత పోస్ట్