అంటరానితనానికి, సమ సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది, బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు జ్యోతిరావ్ ఫూలే అని రాజాం వైయస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తలే రాజేష్ కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం రాజాంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా అభ్యున్నతికి, బాలిక విద్యా వ్యాప్తికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. నేటి యువత పూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.