రాజాం: మృతురాలి వివరాలు వెల్లడించిన పోలీసులు

63చూసినవారు
రాజాం: మృతురాలి వివరాలు వెల్లడించిన పోలీసులు
రాజాం మండలం బొద్దాం గ్రామ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన విదితమే. కాగా మృతురాలి వివరాలు సేకరించిన పోలీసులు శనివారం వెల్లడించారు. ఈమె బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తిమనాన కాంతమ్మ అని తెలిపారు. మతిస్థిమితం లేకుండా మూడు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్