రాజాం: సదరం రీ వెరిఫికేషన్ చేసుకోవాలి : ఎంపీడీవో

66చూసినవారు
రాజాం: సదరం రీ వెరిఫికేషన్ చేసుకోవాలి : ఎంపీడీవో
దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్న వారు రేపు, ఎల్లుండి రాజాం ఏరియా ఆసుపత్రిలో సదరం రీ వెరిఫికేషన్ తనిఖీ చేసుకోవాలని వంగర ఎంపీడీవో త్రినాథ బుధవారం తెలిపారు. వంగర మండలంలోని అరసాడ 15, భాగంపేట 15, కేసీహెచ్పిల్లి 18, కింజంగి 8, కోనంగిపాడు 21, కొప్పర 8, కొప్పరవలస 5, సుమారు 150 మంది రాజాం ఏరియా ఆసుపత్రికి సదరం రీ వెరిఫికేషన్ తనిఖీలలో ఆధార్, సదరం సర్టిఫికెట్ తనిఖీల్లో పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్