రాజాం: ఎస్సీ కాలనీలో కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు

71చూసినవారు
వంగర మండలం కింజంగి గ్రామంలో మంగళవారం నుండి విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బుధవారం తెలియజేశారు. ఈ కాలనీలో 60 ఇల్లు ఉన్నాయని, పిల్లలు వృద్దులు, రోగులు ఉన్నారని విద్యుత్తు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకి ఫోన్ చేయగా స్పందించలేదని తెలియజేశారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తమకు విద్యుత్ వచ్చేలాగా చూడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్