రాజాం: ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోండి

78చూసినవారు
రాజాం: ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోండి
రాజాం పాత ఆర్టీసీ కాంప్లెక్స్ వెనకాల పోస్టాఫీసులో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని పోస్టల్ ఇన్‌స్పెక్టర్‌ శివ గురువారం తెలిపారు. కొత్తగా ఆధార్ తీసుకోవడంతో పాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఫోటో వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు అని అన్నారు. ప్రజలు ఈ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ శివ కోరారు.

సంబంధిత పోస్ట్