పాలిథిన్ సంచుల వాడకంతో తీవ్ర అనర్థం జరుగుతుందని, వీటి బదులు సంప్రదాయబద్ధంగా వస్త్ర సంచులను వినియోగించాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు మంగళవారం పేర్కొన్నారు. రాజాంలోని వికాస తరంగిణి కార్యాలయంలో వస్త్రాలతో చేసిన సంచులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సమన్వయకర్త టీటీవీ రమణమూర్తి, సాయిప్రశాంత్ కుమార్, వి. పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.