వంగరలో ఎరువుల డీలర్లకు ఏవో కన్నబాబు గురువారం పలు సూచనలు చేశారు. విత్తనాలు కొన్న రైతులకు రషీద్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. మొలక శాతం నిర్ధారించిన తర్వాతే అమ్మకాలు చేపట్టాలన్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.