రాజాం: యోగా ద్వారా మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని పొందవచ్చు

72చూసినవారు
రాజాం: యోగా ద్వారా మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని పొందవచ్చు
యోగా ద్వారా మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని పొందవచ్చు అని రాజాం ఎంపీడీవో రఘునాథాచారి అన్నారు. రాజాం మండలం భాగెంపేటలో ఆదివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ వారితో పలు యోగాసనాలు చేయించారు. మండలంలో 17,156 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 2500 మంది పాల్గొన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్