ఆటో, బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన రేగిడి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వంగర మండలం బంగారు వలస గ్రామానికి చెందిన వెలగాడ దాసు అనే వ్యక్తి తన బైక్ పై వస్తున్న నేపథ్యంలో రేగిడి మండలం, బూరాడ గ్రామం వద్ద బైక్, ఆటో ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో దాసు కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో రాజాం ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.