జీవనోపాధులు ప్రణాళికలు తయారీ చెయ్యడం జరుగుతుందని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఏ. చిరంజీవి అన్నారు. శనివారం సంతకవిటి మండలం అక్కరాపల్లి, ముకిందపురం గ్రామాల్లో మహిళా సంఘ సభ్యులతో వార్షిక రుణాలు పై చర్చించారు. సభ్యురాలికి గరిష్టంగా 5లక్షలు ఋణం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకున్న రుణాలుతో తప్పనిసరిగా జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఏపీఎం దదికుమార్, సుధాకర్ పాల్గొన్నారు.