నేరనిరోధక చర్యల్లో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి పల్లెనిద్ర చేశామని రాజాం రూరల్ సీఐ హెచ్. ఉపేంద్రరావు తెలిపారు. మంగళవారం రాత్రి వాసుదేవపట్నంలో పల్లెనిద్ర నిర్వహించారు. ప్రజలు కక్షలు, గొడవలు నివారించి, మాదకద్రవ్యాలు గ్రామంలోకి రానివ్వకూడదని సూచించారు. గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు.