సంతకవిటి మండలం జావాం గ్రామప్రజల ఆరాధ్య దేవత పగడాలమ్మ తల్లి 26వ జాతర వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ఆదివారం జరిగింది. ఈ జాతరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల నుంచి భక్తులు ఆదివారం తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో విద్యుత్ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జాతరకు ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేసింది.చేశారు.