రాజాంలోని అమ్మవారు కాలనీ 2వ లైన్ లో శనివారం ఉదయం ఓ పెంకుటిల్లు ఒక్కసారిగా కూలిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి ముందు భాగం పడిపోయింది. ప్రమాదం సమయంలో నూకరాజు కుటుంబం హాల్‌లో నిద్రిస్తోంది. ఆ శబ్దంతో పొరుగువాళ్లు వచ్చి వారిని బయటకు రక్షించారు. ప్రస్తుతం నివాసం లేక తల్లడిల్లుతున్న నూకరాజు. ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు.