శ్రీవారి ఆలయాలలో శ్రావణ శనివార పూజలు

60చూసినవారు
శ్రీవారి ఆలయాలలో శ్రావణ శనివార పూజలు
రాజాం నియోజకవర్గంలోని పలు శ్రీ వైష్ణవ ఆలయాలలో శనివారం శ్రావణ మాసం త్రయోదశి పర్వదినం కావడంతో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వంగర, రేగిడి, సంతకవిటి, రాజాంలో గల వివిధ శ్రీవైష్ణవ ఆలయాలలో అష్టోత్తర శతనామావలితో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తులసి పత్రాలతో అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తుల గోత్రనామాలతో పూజలుచేసి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్