16 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా ఈ -శ్రమ్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని రాజాం సహాయ కార్మిక అధికారి బి. కోదండరావు తెలిపారు. గురువారం కావలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధార్ నెంబర్‌ను ఈ -శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ -శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా పరిహారం అందుతుందని ఆయన వెల్లడించారు.