వంగర మండలం మడ్డువలస కుడి ప్రధాన కాలువలో దూకి మంగళవారం ఓ తల్లి తన పిల్లలతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తెలిసిందే. కాగా కాలువలో గల్లంతైన బాలిక షైనీ (6) మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎస్సై షేక్ శంకర్ ఆధ్వర్యంలో బాలిక ఆచూకీ కోసం మంగళవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టడంతో బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు