వంగర: కొండశేఖరపల్లి గ్రామ సమీపంలో గజరాజులు తిష్ట

15చూసినవారు
వంగర: కొండశేఖరపల్లి గ్రామ సమీపంలో గజరాజులు తిష్ట
వంగర మండలము కొండ శేఖరపల్లి గ్రామ సమీపంలో గజరాజులు తిష్ట వేసి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రెండు రోజులుగా గజరాజులు ఒకేచోట ఉండడంతో గ్రామస్తులు పొలం పనులుకైన బయటికి రావడానికి భయాందోళన చెందుతున్నారు. గజరాజులు ప్రతి ఏడాది జూన్ జూలై మాసంలోనే తిరిగిన చోటే తిరిగి రైతులకు ఎంతో నష్టం కలిగిస్తున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టి మా పంటలను కాపాడవలసిందిగా వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్