వంగర మండలం మడ్డువలస జూనియర్ కళాశాల దగ్గర ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తుండగా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఆరోగ్య సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, శశిధర్, ఆశ వర్కర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.