మంచినీటి ట్యాంకును శుభ్రం చేసుకున్న గ్రామస్తులు

70చూసినవారు
మంచినీటి ట్యాంకును శుభ్రం చేసుకున్న గ్రామస్తులు
వంగర లోని మంచినీటి ట్యాంకును శనివారం శుభ్రపరిచారు. గ్రామ సర్పంచు కే భారతి ఆధ్వర్యంలో వంగర గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నీటి ట్యాంకులోకి దిగి అందులోని చెత్తాచెదారాన్ని తొలగించారు. వాటర్ ట్యాంకు వెళ్లే దారిలోనున్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగించారు. పైపులైను వద్దనున్న చెత్తను తొలగించారు. ఈ నీటి ట్యాంకు ద్వారా గ్రామంలో 450 కుటుంబాల వారికి తాగునీరు సరఫరా అవుతుందని సర్పంచ్ భారతి వివరించారు.

సంబంధిత పోస్ట్