వంగర మండల కేంద్రంలో ఆదివారం ఆర్ సి ఎం చర్చ్ ఫాదర్ సుధాకర్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మ్రాని కొమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. దావీదు తనయ హోసన్న, యూదుల రాజుకు జేజేలు, అంటూ కేకలు వేస్తూ , పాటలు పాడుతూ ఏసుప్రభును కీర్తించి పురవీధులలో తిరిగారు. అనంతరం ఆర్. సి. యం చర్చిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపదేశులు, సిస్టర్స్, పలు గ్రామాల క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
v