వంగర: మండలంలో 20 రోజుల నుండి ఏనుగులు విధ్వంసం "ఎంపీపీ"

0చూసినవారు
వంగర మండలంలో గత 20 రోజుల నుండి ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయని మండల పరిషత్ అధ్యక్షులు ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ శనివారము పత్రికా సమావేశంలో తెలియజేశారు. మురువాడ, శివ్వాం, మడ్డువలస, నీలయ్యవలస, జగన్నాథవలస, గ్రామాల్లో ఏనుగులు పంటలు ధ్వంసం చేశాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగులను అటవీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతమునకు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అధికార యంత్రాంగము పూర్తిగా విఫలమైందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్