వంగర: రేపు అంబేద్కర్ గురుకులంలో ప్రవేశ పరీక్ష

56చూసినవారు
వంగర: రేపు అంబేద్కర్ గురుకులంలో ప్రవేశ పరీక్ష
వంగర మండలం మడ్డువలసలోని డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ పాఠశాల, కళాశాల ప్రవేశానికి ఈనెల 13న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్. పద్మజ శనివారం తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆధార్ కార్డ్, హాల్ టికెట్ తో ఒక గంట ముందు హాజరు కావాలన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్