వంగర మండలంలోని లక్షింపేట ప్రత్యేక కోర్టు జడ్జిని వెంటనే బదిలీ చేసి కొత్త జడ్జిని నియమించాలని దళిత మహాసభ రాష్ట్ర నాయకుడు ఎస్ నూకరాజు డిమాండ్ చేశారు. గురువారం గ్రామంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దళితులుకు ఊచకోత జరిగి 13ఏళ్లు అయినా దళితులను హత్య చేసిన ముద్దాయిలకు నేటి వరకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్దాయిల పట్ల జడ్జి సానుభూతితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.