వంగర: మండలంలో శతశాతం పుస్తకాల పంపిణీ

65చూసినవారు
వంగర: మండలంలో శతశాతం పుస్తకాల పంపిణీ
వంగర మండలంలో గల 46 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శత శాతం పుస్తకాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని ఎంఈఓ - 2 జగదీశ్వరి తెలిపారు. ఈ మేరకు మండలంలోని అరసాడ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మండలంలో 1 నుండి 10 వ తరగతి చదువుతున్న 3, 638 మంది విద్యార్థులకు 20, 151 అచ్చు పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్