కొండ పోరంబోకు భూములను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న వారు దానిని సొంత ఇల్లు పట్టాగా మార్చుకునేందుకు ప్రభుత్వము జీవో నెంబర్ 30ని తీసుకు వచ్చిందని వంగర తహసిల్దార్ డి ధర్మరాజు గురువారం తెలిపారు. ఈ భూములలో ఇల్లు నిర్మించుకున్న అక్రమ దారులు వీఆర్వో వద్ద కానీ ఎమ్మార్వో కార్యాలయంలో కానీ క్రమబద్ధీకరణ అప్లికేషన్ తీసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు.