మహనీయులు చూపిన బాటలో మనం నడవాలి.. రామప్రతాప్

56చూసినవారు
మహనీయులు చూపిన బాటలో మనం నడవాలి.. రామప్రతాప్
నైర పంచాయితీలో గురువారం సర్పంచ్ అరవల రామప్రతాప్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జండా వందన కార్యక్రమంలో పాల్గొని జెండా వందనం చేసి ప్రసంగించారు. స్వాతంత్ర్య ఫలాలు మనకు అందడంతో వేలమంది భారతీయుల త్యాగఫలాలు ఉన్నాయన్నారు. మహనీయులు చూపిన బాటలో మనమంతా నడవాలని అన్నారు. గ్రామ పెద్దలు అరవల రవీంద్ర, కర్రీ కృష్ణమోహన్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్