భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మంగళవారం రాజాంలో నిరసన తెలిపారు. ఈ మేరకు లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వి నరసింహారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. సంక్షేమ బోర్డు సమర్ధవంతంగా నడపాలని కోరారు. ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీఐటీయు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.