వంగర మండల పరిషత్ కార్యాలయం ఆవరణ నుంచి యోగాంద్ర మాస్ ర్యాలీ గురువారం నిర్వహించారు. నిత్యం యోగా, నిత్యం ఆరోగ్యం అనే నినాదాలతో ర్యాలీ జరిగింది. ప్రజలు ప్రతిరోజు ఒక గంట యోగాసనాలు వేస్తే ఆసుపత్రికి వెళ్లి మందులు వాడవలసిన పని ఉండదని, ఆరోగ్యంగా ఉండవచ్చని ఎంపీడీవో రఘునాథ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేష్ ముఖర్జీ కుటమీ నాయకులు పాల్గొన్నారు.