వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుముల వెంకటేష్ (19) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రాజాం ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వెంకటేష్ తండ్రి రెండేళ్ల క్రితం మృతిచెందాడు. తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.